క్యాంప్ పాలిటిక్స్.. హైదరాబాదులో తమిళనాడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

  • తమిళనాడు రాజకీయాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
  • విజయ్ పార్టీకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్
  • తమ ఎమ్మెల్యేలను హైదరాబాద్‌లోని రిసార్ట్‌కు తరలించిన కాంగ్రెస్

తమిళనాడు రాజకీయాల్లో నెలకొన్న ఉత్కంఠ ఇప్పుడు హైదరాబాద్‌కు చేరింది. రాష్ట్రంలో 'హంగ్' ఏర్పడటంతో, ఎమ్మెల్యేల కొనుగోలుకు బేరసారాలు (హార్స్ ట్రేడింగ్) జరుగుతాయనే భయంతో తమిళనాడు కాంగ్రెస్ కమిటీ తమ ఐదుగురు ఎమ్మెల్యేలను ప్రత్యేక విమానంలో హైదరాబాద్‌కు తరలించింది. తమిళనాడులో సంక్షోభం సమసిపోయేంత వరకు వీరు హైదరాబాద్‌లోని ఒక రిసార్ట్‌లో బస చేయనున్నట్టు సమాచారం.


తమిళనాడులో విజయ్ నేతృత్వంలోని టీవీకేకి మద్దతు ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి తెలంగాణను సురక్షిత ప్రాంతంగా ఎంచుకుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో, ఎమ్మెల్యేలకు పూర్తి రక్షణ ఉంటుందని అధిష్ఠానం భావించింది. తమిళనాడులో ప్రభుత్వం ఏర్పడే వరకు వీరు ఇక్కడే ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలు తమ మద్దతు లేఖలను గవర్నర్‌కు అందజేశాయి.


Tamil Nadu Congress
Tamil Nadu politics
Congress MLAs
Hyderabad resort
Horse trading
TVK Vijay
Tamil Nadu government formation
Telangana
Political crisis

More Telugu News